: ఆదిలాబాదులో పంజా విసిరిన చిరుత...నలుగురిపై దాడి, ఒకరు దుర్మరణం
ఆదిలాబాదు జిల్లా కుబీర్ మండలం మర్లగుండ పంట పొలాల్లో చిరుత పులి పంజా విసిరింది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న నలుగురు కూలీలపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఓ వ్యవసాయ కూలీ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మిగిలిన ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.