: తెలంగాణ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

తెలంగాణ తల్లి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో గత అర్ధరాత్రి చోటుచేసుకుంది. విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు దండేపల్లి బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగప్రవేశం చేసిన పోలీసులు, దుండగులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో, టీఆర్ఎస్ కార్యకర్తలు శాంతించారు.