: మోదీకి రామ్మోహన్ నాయుడి శాలువా సత్కారం
టీడీపీ యువ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. తన పార్టీకి చెందిన మరో ఎంపీ గల్లా జయదేవ్, ఓబీసీ నేతలతో కలిసి రామ్మోహన్ నాయుడు నిన్న ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఓబీసీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన ప్రధానికి వివరించారు. రామ్మోహన్ నాయుడు చెప్పిన విషయాలను ప్రధాని సావధానంగా విన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ప్రధానిని దుశ్శాలువాతో సత్కరించారు.