: తీహార్ ఖైదీలను అలరించిన సూఫీ గీతాలు, కథక్ నృత్యం


బయటి ప్రపంచం తెలియకుండా, ఎలాంటి వినోదం లేకుండా జైల్లో ఖైదీల జీవితం గడుస్తుంటుంది. అయితే అప్పుడప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేసి వారికి సాంత్వన కలిగేలా చేస్తుంటారు జైలు అధికారులు. ఈ కోవలోనే ఢిల్లీలోని తీహార్ జైలు ఖైదీల కోసం ప్రత్యేకంగా సూఫీ గీతాల కచేరీని, కథక్ నృత్య కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేయించారు. 'లెజెండ్స్ ఆఫ్ ఇండియా', సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో సూఫీ గాయని సోనమ్ కల్రా, కథక్ నృత్యకారిణి రచనా యాదవ్ లు అలరించారు. తన గాన మాధుర్యం, సారంగి, చాహున్, ఇరానీ దాఫ్ వంటి సంగీత పరికరాలతో సోనమ్ చేసిన సంగీత కచేరి ఖైదీలను ఎంతో ఆకట్టుకుంది. తన బృందంతో కలసి రచన అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమాలపై ఖైదీలు సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News