: మావోలకు ఎదురుదెబ్బ... పోలీస్ ఎన్ కౌంటర్ లో ముగ్గురు హతం


వరుస దాడులతో పోలీసులకు సవాల్ విసురుతున్న మావోయిస్టులకు నేటి ఉదయం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ లో నేటి తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. సుక్మా జిల్లా తొంగ్ పాల్ సమీపంలోని మహుపహాడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోలు తారసపడగా, ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులు ముగిసిన అనంతరం పోలీసులు ముగ్గురు మావోల మృతదేహాలను కనుగొన్నారు. పోలీసుల మెరుపు దాడి నేపథ్యంలో మావోలు భారీ ఎత్తున సేకరించుకున్న ఆయుధాలను అక్కడే వదిలివెళ్లారు. ఈ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News