: సుష్మా స్వరాజ్ పై సోనియా తీవ్ర వ్యాఖ్యలు... నాటకాలాడటంలో నేర్పరి అంటూ ఆరోపణ
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లోక్ సభలో మరోసారి ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మండిపడ్డారు. పార్లమెంట్ ఆవరణలో ఈ రోజు ఆందోళన చేస్తున్న సందర్భంగా సోనియా అనూహ్య రీతిలో ధ్వజమెత్తారు. నాటకాలాడటంలో సుష్మ నిష్ణాతురాలని వ్యాఖ్యానించారు. అయితే తానే గనుక సుష్మా స్థానంలో ఉండి ఉంటే ఆపదలో ఉన్నవారికి తప్పకుండా సహాయం చేసేదాన్నని సోనియా చెప్పారు. అయితే చట్టపరిధిని మాత్రం మీరేదాన్ని కానన్నారు.