: ఎలాంటి శిక్షణ పొందారు? భారత్ లోకి ఎలా వచ్చారు?... వివరాలను వెల్లడించిన ఉగ్రవాది నవేద్


కసబ్ తర్వాత ప్రాణాలతో పట్టుబడ్డ మరో ఉగ్రవాది నవేద్ అలియాస్ ఉస్మాన్ అలియాస్ ఖాసింఖాన్. దీంతో నవేద్ పై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దేశంపై యుద్ధం ప్రకటించిన నేరంపై నవేద్ పై కేసు నమోదు చేసేందుకు జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం నిన్న అనుమతి మంజూరు చేసింది. ఈ క్రమంలో, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణను తన చేతుల్లోకి తీసుకుంది. విచారణ సందర్భంగా నవేద్ పలు విషయాలను వెల్లడించాడు. తాను, నొమిన్ ఇద్దరం కలసి ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా వద్ద ఉన్న సరిహద్దు కంచెను కట్ చేసి భారత్ లోకి చొరబడ్డామని విచారణలో నవేద్ చెప్పాడు. ఆ తర్వాత, తొలుత అవంతిపుర, పుల్వామాలోని పర్వత ప్రాంతాలకు చేరుకున్నామని... అక్కడున్న ఓ గుహలో మకాం వేశామని తెలిపాడు. ఆ తర్వాత ఉధంపూర్ చేరుకుని కాల్పులకు తెగబడ్డామని చెప్పాడు. లష్కరే తోయిబా సంస్థ తమకు శిక్షణ ఇచ్చిందని విచారణలో నవేద్ స్పష్టం చేశాడు. 'దౌర్ ఎ ఆమ్', 'దౌర్ ఎ ఖాస్' అనే రెండు మాడ్యూల్స్ లో తాము శిక్షణ పొందామని... తొలి మాడ్యూల్ లో శారీరక సామర్థ్యం, చిన్నచిన్న ఆయుధాలను ప్రయోగించడం, పర్వతారోహణ తదితరాల్లో శిక్షణ ఇచ్చారని... రెండో మాడ్యూల్ లో ఏకే47లాంటి అత్యాధునిక ఆయుధాల వాడకం, బాంబులు, ఇతర పేలుడు పదార్థాల తయారీలాంటి వాటిలో శిక్షణ ఇచ్చారని వెల్లడించాడు.

  • Loading...

More Telugu News