: నేడు కేసీఆర్ ను కలవనున్న బీజేపీ నేత నాగం
తెలంగాణ సీఎం కేసీఆర్ ను బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఈ మధ్యాహ్నం 12 గంటలకు కలవనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని కోరుతూ సీఎంకు ఆయన వినతిపత్రం సమర్పించనున్నారని తెలిసింది. అయితే ఈ భేటీలో ఎలాంటి రాజకీయం లేదని నాగం వర్గీయులు చెబుతున్నారు. ఇటీవల తెలంగాణ జిల్లాల్లోని పలు పెండింగ్ ప్రాజెక్టులను నాగం సందర్శించిన సంగతి తెలిసిందే.