: నినాదాలతో హోరెత్తించిన సోనియా... నాలుగో రోజు పార్లమెంటులో కాంగ్రెస్ ఆందోళన
ఎంపీల సస్పెన్షన్ పై కాంగ్రెస్ పార్టీ నిరసనలు నేడు కూడా వరుసగా నాలుగో రోజు కొనసాగాయి. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ఆ పార్టీ నినాదాల హోరు వినిపించింది. పార్టీ అధినేత్రి సోనియా గాందీ నేతృత్వంలో జరిగిన ఆందోళనలో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు పాలుపంచుకున్నారు. గత మూడు రోజుల ఆందోళనలకు భిన్నంగా నేడు సోనియా గాంధీ ఉత్సాహం ప్రదర్శించారు. చేతికి నల్ల రిబ్బన్ కట్టుకున్న ఆమె మోదీ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పార్టీ యువ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా తో కలిసి సోనియా నినాదాల హోరు వినిపించారు.