: ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఏపీ జర్నలిస్ట్ ఫోరం ధర్నా
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రోజు రోజుకీ ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏపీ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టులు ధర్నా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన టీడీపీ కాకినాడ ఎంపీ తోట నర్సింహం మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.