: ఐఎస్ఐఎస్ లో చేరతానంటూ తప్పించుకు తిరుగుతున్న జర్నలిస్ట్ అరెస్ట్


ఐఎస్ఐఎస్ లో చేరతానంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముంబయి జర్నలిస్ట్ జుబెర్ అహ్మద్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఢిల్లీ పోలీసులు ఈ రోజు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల నుంచి ముంబయి పోలీసులు అతని కోసం వెతుకుతుండగా తప్పించుకు తిరుగుతున్నాడు. దాంతో ఢిల్లీ పోలీసులను కూడా అలెర్ట్ చేయడంతో రాజధానిలో పట్టుకున్నారు. ప్రస్తుతం అతను వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని, అధికారులు విచారిస్తున్నారని తెలిసింది.

  • Loading...

More Telugu News