: సత్తా చాటిన తెలుగు టైటాన్స్... తొడకొట్టిన ‘బాహుబలి’ ఫేం ప్రభాకర్
ప్రొ కబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ఆడిన 9 మ్యాచ్ లలో 6 మ్యాచ్ లలో విజయం సాధించడంతో పాటు మరో మ్యాచ్ ను టై చేసుకున్న తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. నిన్న జీఎంసీ బాలయోగి స్టేడియంలో పాట్నాతో జరిగిన మ్యాచ్ లోనూ విజయ ఢంకా మోగించింది. సొంత గడ్డపై జరిగిన మూడు మ్యాచ్ లలో ఓ మ్యాచ్ టైగా ముగియగా, మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ టైటాన్స్ సత్తా చాటారు. ఇక నిన్న తెలుగు టైటాన్స్ ఆడిన మ్యాచ్ ను ‘బాహుబలి’ ఫేం ప్రభాకర్ ఆసక్తిగా తిలకించాడు. తెలుగు టైటాన్స్ విజయం సాధించడంతో తొడ కొట్టి మరీ సందడి చేశాడు.