: దేశం ద్రౌపది... మోదీ దుశ్శాసనుడు: కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్య


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జనార్దన్ పూజారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో 25 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన దేశాన్ని ద్రౌపదిగానూ, ప్రధాని నరేంద్ర మోదీని దుశ్శాసనుడిగానూ అభివర్ణించారు. ‘‘లోక్ సభలోని పరిణామాలు మహాభారతంలోని సన్నివేశాలను, పాత్రలను గుర్తుకు తెస్తున్నాయి. బీజేపీ సభ్యులు కౌరవుల్లా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు పాండవుల్లా పోరాడుతున్నాయి. మోదీ దుశ్శాసనుడిని తలపిస్తుంటే, కేబినెట్ దుర్యోధనుడిలా వ్యవహరిస్తోంది. వీరి చేతిలో దేశం పాంచాలిలా చిక్కుకుపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో మీడియా శ్రీకృష్ణుడి పాత్ర పోషించాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News