: ఆ లేఖ ఎక్కడిదో?... జస్టిస్ దీపక్ మిశ్రా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
గుర్తు తెలియని దుండగుల నుంచి బెదిరింపు లేఖ అందుకున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కొద్దిసేపటి క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై బాంబుపేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ ను జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జస్టిస్ మిశ్రాకు అందిన లేఖ ఉగ్రవాదుల నుంచే వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జస్టిస్ మిశ్రా ఫిర్యాదునందుకున్న ఢిల్లీ పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు రాసి ఉంటారన్న పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.