: అప్పు తీర్చమని అడిగినందుకు ఫైనాన్షియర్ సజీవ దహనం
విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తీర్చమని అన్నందుకు ఓ ఫైనాన్షియర్ ను కొందరు దుండగులు సజీవ దహనం చేశారు. ఈ ఘటన జిల్లా పరిధిలోని రాంబిల్లి మండలం లాలం కోడేరులో జరిగింది. బైక్ పై వెళుతున్న ఆయనను అటకాయించిన దుండగులు బైక్ సహా దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వివరించారు.