: ముంబై పేలుళ్ల కేసు నిందితుడు, దావూద్ కు సన్నిహితుడైన యాకూబ్ ఖాన్ మృతి
1993 నాటి ముంబై పేలుళ్ల కేసు ప్రధాన నిందితుల్లో ఒకడైన యాకూబ్ ఖాన్ అలియాస్ యెద్ యాకూబ్ పాకిస్థాన్ లోని కరాచీలో మరణించాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడైన యాకూబ్ అనారోగ్యం కారణంగా మరణించినట్టు భారత నిఘా వర్గాలు ఈ ఉదయం వెల్లడించాయి. యాకూబ్ కు తీవ్రమైన గుండెపోటు రాగా, ఆసుపత్రికి తరలిస్తుంటే మృతి చెందాడని తెలిపాయి. అయితే, ఇది మీడియా కథనాల ద్వారా మాత్రమే తెలిసిందని, అధికారిక సమాచారం అందాల్సి ఉందని ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా వ్యాఖ్యానించారు. ముంబైకి ఆర్డీఎక్స్ తెచ్చి వివిధ ప్రాంతాలకు తరలించడంలో టైగర్ మెమన్ కు యాకూబ్ సహకరించినట్టు ఆధారాలున్నాయి.