: 'యూఎస్ 911' కన్నా 'నిర్భయ 112' మిన్న... పంద్రాగస్టు నాటి ప్రధాని ప్రసంగం లీక్!


ఆగస్టు 15న న్యూఢిల్లీలో ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగం వివరాలు హోం మంత్రిత్వ శాఖ నుంచి లీక్ అయ్యాయి. అమెరికాలో వివిధ సమస్యలు, నేరాల గురించి తెలిపేందుకు వాడే '911'తో పోలిస్తే భారత్ నిర్వహించే నిర్భయ హెల్ప్ లైన్ '112' గొప్పదని మోదీ చెప్పనున్నారట. రోజుకు 3,500 మంది కాల్ సెంటర్ ఆపరేటర్లు 10 లక్షల వరకూ కాల్స్ స్వీకరించేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో '112' నడుస్తుందని, 2017 నాటికి లక్షకు పైగా పోలీసు వాహనాల్లో ప్రత్యేక ట్రాకింగ్ ట్యాబ్స్ అమరుస్తామని కూడా ఆయన చెప్పనున్నారట. '911' ఎమర్జన్సీ రెస్పాన్స్ సిస్టమ్ తో పోలిస్తే '112' ఏ విధంగా మిన్నగా ఉండబోతుందన్న విషయాన్ని, దీని వాడకంపై సలహా సూచనలు ఇవ్వాలని హోం మంత్రిత్వ శాఖ మిగతా అన్ని శాఖల అధిపతులనూ కోరుతూ లేఖలు పంపిందట. మంత్రిత్వ శాఖల నుంచి వచ్చే సమాధానాలను స్వాతంత్ర దినోత్సవం ప్రసంగం సందర్భంగా మోదీ ప్రస్తావిస్తారని కూడా హోం శాఖ ఆ లేఖల్లో వెల్లడించింది. కాగా, నిర్భయ హెల్ప్ లైన్ కోసం రూ. 321 కోట్లను కేంద్రం కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ టోల్ ఫ్రీ ఫోన్ నంబరు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి రానుంది.

  • Loading...

More Telugu News