: రూ. 10,800 కోట్ల ఆస్తులున్న రష్యన్ ఇన్వెస్టర్... భారత స్టార్టప్ లపై కన్నేశాడు!


ఓ చిన్న వినూత్న ఆలోచన ఉంటే పెట్టుబడులకు సమస్యే రాదు. ఇప్పటికే రతన్ టాటా వంటి బిలియనీర్లు ఎన్నో స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీలు భవిష్యత్తులో చరిత్ర సృష్టించి, పెట్టిన పెట్టుబడికి ఇబ్బడి ముబ్బడిగా రాబడులు అందిస్తాయన్నదే వారి నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకంతో 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,830 కోట్లు) ఆస్తులున్న రష్యన్ పారిశ్రామిక దిగ్గజం యూరీ మిల్నర్ కన్ను ఇండియాపై పడింది. కొంతకాలం క్రితం బెంగళూరులో ప్రారంభమైన 'ప్రాక్టో' సంస్థలో ఆయన వాటాలు కొన్నాడు. ఈ సంస్థ రోగులు, డాక్టర్ల మధ్య సంబంధాలను కొనసాగించే సేవలను అందిస్తుంది. ముందస్తు అపాయింట్ మెంట్ల నుంచి, ఆన్ లైన్ వైద్యం, ప్రిస్క్రిప్షన్, డాక్టరు వద్దకు వెళ్లకుండానే రిపోర్టుల పరిశీలన తదితర సర్వీసులను అందిస్తోంది. అటు డాక్టర్లకు, ఇటు రోగులకు ఉపయుక్తంగా ఉన్న సంస్థ ఆదాయమూ ఇప్పుడు భారీగా పెరుగుతోంది. కాగా, మిల్నర్ గతంలో ఫేస్ బుక్, ఎయిర్ బీఎన్బీ తదితర సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడు. ఆయన తన వెంచర్ కాపిటల్ సంస్థ 'డీఎస్ టీ గ్లోబల్' ద్వారా ఈ పెట్టుబడులు పెట్టారు. మిల్నర్ ఇప్పటికే ఇండియాకు చెందిన ఫ్లిప్ కార్ట్, ఓలా, హౌసింగ్ డాట్ కాం, స్విగ్గీ వంటి సంస్థలు స్టార్టప్ లుగా ఉన్న దశలోనే ఇన్వెస్ట్ చేసి భారత ఔత్సాహికులకు అండగా నిలిచారు.

  • Loading...

More Telugu News