: ఎన్టీఆర్ ఆంధ్రోడయినా, చాలా మంచోడు: తెలంగాణ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావును టీఆర్ఎస్ నేతలు కొనియాడారు. ఆయన ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా, తెలంగాణ మేలు కోరుకున్నారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. ఇక్కడి వారి కోసం ఎన్టీఆరే 610 జీవోను తీసుకువచ్చారని గుర్తు చేసిన ఆయన, తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆనాడే తెలుసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేశారని వివరించారు.