: అప్పట్నుంచి సిగరెట్లు తాగడం మానేశా: మహేష్ బాబు


తాను నటించిన శ్రీమంతుడు చిత్రం నేడు విడుదల కానున్న సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు ఓ పత్రిక మాధ్యమంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. తాను ఇదివరకు సిగరెట్ కాల్చేవాడినని, అయితే... వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాల్లో 'ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్' అనే అంశం చదివిన తరువాత ఆ అలవాటు మానుకున్నానని తెలిపాడు. ఆ పుస్తకం అంటే తనకు చాలా ఇష్టమని, ఆధ్యాత్మికంగా ఉండే బుక్స్ తరచూ చదువుతానని వివరించాడు. ఫిక్షన్ బుక్స్ జోలికెళ్లనని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News