: నాగార్జున వర్శిటీలో బీటెక్ విద్యార్థుల మద్యం బాగోతం... సస్పెండ్ చేసిన అధికారులు


నాగార్జున యూనివర్సిటీలో కొందరు విద్యార్థుల ఆగడాలు ఎలా ఉంటాయో తెలిపే మరో ఘటన ఇది. వర్శిటీలోకి మద్యం బాటిల్స్ తెచ్చేందుకు ప్రయత్నించిన ముగ్గురు సీనియర్లను సస్పెండ్ చేశారు. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న మణికంఠ, సాయి చరణ్, అబ్బాస్ లు క్యాంపస్ హాస్టల్ లోకి మద్యం సీసాలు తీసుకువెళుతుంటే సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై సెక్యూరిటీ గార్డులు వర్శిటీ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, విద్యార్థులు సంజాయిషీ చెప్పాల్సి వుందని, మరోసారి తమ పిల్లలు ఇలా చేయబోరని వారి తల్లిదండ్రుల నుంచి హామీ లభిస్తేనే విద్యార్థులను తిరిగి వర్శిటీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News