: ఏపీ సర్కారు సర్వేలో మంత్రుల ర్యాంకులివే!


ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసేందుకు ప్రభుత్వం స్వీయ సర్వే చేయించిన సంగతి తెలిసిందే. ఈ సర్వే తరువాత మంత్రుల ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో పరిటాల సునీతకు 3వ ర్యాంకు, పల్లె రఘునాధ రెడ్డికి 12వ ర్యాంకు లభించాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, వీరిద్దరికీ వరుసగా 22, 140 ర్యాంకులు లభించాయి. గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావుకు 6వ ర్యాంకు, రావెల కిశోర్ బాబుకు 10వ ర్యాంకు లభించగా, వీరిద్దరికీ రాష్ట్రంలో వరుసగా 63, 100 ర్యాంకులు వచ్చాయి. కృష్ణా జిల్లాలో, దేవినేని ఉమ, కొల్లు రవీంద్రలు 3వ ర్యాంకులో నిలిచారు. వీరికి రాష్ట్రంలో వరుసగా 30, 70 ర్యాంకులు లభించాయి. పశ్చిమ గోదావరిలో పైడికొండల మాణిక్యాలరావుకు 8, పీతల సుజాతకు 13 ర్యాంకులు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడికి 5వ ర్యాంకు, నిమ్మకాయల చినరాజప్పకు 10వ ర్యాంకు, కర్నూలులో కేఈ కృష్ణమూర్తికి 2వ ర్యాంకు, విశాఖలో అయ్యన్న పాత్రుడికి 3వ ర్యాంకు, గంటాకు 14వ ర్యాంకు వచ్చాయి. విజయనగరం జిల్లాలో కిమిడి మృణాళినికి 8వ ర్యాంకు, శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడికి 2వ ర్యాంకు లభించాయి.

  • Loading...

More Telugu News