: ఉధంపూర్ లో మరో ఉగ్రదాడి
జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ సమీపంలో మరో ఉగ్రదాడి జరిగింది. ఇక్కడి బసంత్ గఢ్ పోలీస్ చెక్ పోస్టు వద్ద గత రాత్రి ఉగ్రవాదులు కాల్పులతో విరుచుకుపడ్డారు. పోలీసు చెక్ పోస్టు పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అప్రమత్తమైన సరిహద్దు భద్రతా బలగాలు వారి కాల్పులను తిప్పికొట్టాయి. బుధవారం నాడు ఇపే ప్రాంతంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాల కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేసి ఇద్దరు జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా, తాజా దాడిలో ఇద్దరు పోలీస్ అధికారులకు గాయాలు అయినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఉగ్రవాదులు పారిపోగా, వారి కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టినట్టు వివరించారు.