: డైనోసార్ అస్థిపంజరం, గుడ్ల శిలాజాలను దొంగిలించి ఇంట్లో దాచుకున్నారు!


చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో ఓ ఇంటి నుంచి డైనోసార్ అస్థిపంజరం, 200కి పైగా గుడ్ల శిలాజాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి హెయున్ నగరంలో ఎన్నో ఏళ్లుగా తవ్వకాలు జరుగుతుండగా, డైనోసార్ల శిలాజాలు భారీగా లభ్యమవుతున్నాయి. వీటిలో కొన్నింటిని స్థానికులు ఎత్తుకెళ్లడం పరిపాటిగా మారింది. దాంతో, పోలీసులు తరచూ ఇళ్లపై దాడి చేస్తుంటారు. తాజాగా చేసిన దాడి కూడా ఇలాంటిదే. డైనోసార్ అస్థిపంజరాన్ని, గుడ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పరిశీలన నిమిత్తం సంబంధింత విభాగానికి అప్పగించారు. ఆ డైనోసార్ సిటాకోసారస్ రకానికి చెందినదని గుర్తించారు. ఇది విలుప్త సెరటోప్సియన్ డైనోసార్ జాతికి చెందినదని తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News