: సూర్యాపేటలో రూ.2 కోట్ల నగదు పట్టివేత... కర్ణాటకలోని ఓ బ్యాంకులో చోరీకి గురైన సొత్తుగా అనుమానం


నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఇద్దరు వ్యక్తులు కారులో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేఏ 28 ఎన్ 9119 నెంబరు గల కారులో సూర్యాపేట హైటెక్ బస్టాండు సమీపంలో వారు తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చింది. వారిని ఆపి ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఇటీవలే కర్ణాటకలోని ఓ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. సూర్యాపేటలో పట్టుబడ్డ సొమ్ము అక్కడిదే అయివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News