: మహిళా కానిస్టేబుల్ కు అసభ్య సందేశాలు పంపిన నరసరావుపేట రూరల్ సీఐపై వేటు


గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ మహిళా కానిస్టేబుల్ కు అసభ్య సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్న రూరల్ సీఐ శరత్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా కానిస్టేబుల్ నాగశ్వేత రూరల్ సీఐ వంకర బుద్ధిపై రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ కు ఫిర్యాదు చేసింది. సీఐ శరత్ బాబు తనకు పంపిన సందేశాలను కూడా ఆమె ఎస్పీకి చూపింది. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని వాపోయింది. ఈ విషయంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు, ఆ కమిటీ నివేదిక మేరకు సీఐను సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News