: రూ.24 లక్షల విలువ చేసే పైరసీ సీడీలను రోడ్డురోలర్ తో తొక్కించిన చెన్నై పోలీసులు


చెన్నై పోలీసులు సినిమా పైరసీ భూతంపై ఉక్కుపాదం మోపుతున్నారు. పలువురు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న 80,000 వీసీడీలు, డీవీడీలను ధ్వంసం చేశారు. స్వాధీనం చేసుకున్న డిస్కులను ఓ రోడ్డుపై వేసి, రోడ్డురోలర్ తో వాటిని తొక్కించారు. ఆ సీడీల విలువ రూ.24 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సీడీలతో పాటు 34 డీవీడీ రైటింగ్ మెషీన్లు కూడా రోడ్డురోలర్ చక్రాల కింద నలిగిపోయాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికి పోలీసులు ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారు. పాత కమిషనర్ కార్యాలయం వద్ద ఈ సీడీల విధ్వంసకాండ కొనసాగింది. రోడ్డురోలర్ నిమిషాల వ్యవధిలో పని పూర్తిచేయగా, చెన్నై కార్పొరేషన్ సిబ్బంది తుక్కుగా మారిన సీడీలను, రైటింగ్ మెషీన్లను అక్కడి నుంచి ఎత్తివేశారు.

  • Loading...

More Telugu News