: దేశవ్యాప్తంగా 6 శాతమే వర్షపాతం... అల్పపీడనం ఏర్పడితేనే వర్షాలు పడతాయంటున్న వాతావరణ నిపుణులు


ఈ ఏడాది దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో వర్షపాత వివరాలను వాతావరణ శాఖ నిపుణులు నర్సింహారావు వివరించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 6 శాతం మాత్రమే వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈ నెలలో 10 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక తెలంగాణలో సాధారణం కంటే 26 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు. తెలంగాణలోని 10 జిల్లాల్లో ఏడు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉందన్నారు. కోస్తాంధ్రలో సాధారణం కంటే 11 శాతం ఎక్కువ వర్షపాతం ఉన్నా, నెల్లూరు జిల్లాలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని నర్సింహారావు వివరించారు. ఇటు రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో కూడా సాధారణ వర్షపాతం నమోదైందని, మిగతా జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసిందని పేర్కొన్నారు. బే ఆఫ్ బెంగాల్ ల్లో అల్పపీడనం ఏర్పడితేనే రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని నర్సింహారావు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News