: ఇకపై రైళ్లలో కూడా షీ టీమ్స్... మహిళలను వేధిస్తే ఆటకట్టిస్తారు


హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న షీ టీమ్స్ బృందం సేవలు మరింత విస్తరించబోతున్నాయి. ఇకపై రైళ్లలో కూడా మహిళలను వేధించే పోకిరీగాళ్ల ఆటకట్టించేందుకు షీ టీమ్స్ పనిచేయనున్నాయి. ఇకనుంచి నగరం మీదుగా ప్రయాణించే ప్రతి రైలులో షీ టీమ్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మహిళలను వేధిస్తున్నట్టు కనిపిస్తే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 1512కు గానీ, కంట్రోల్ రూమ్ నెం.9440700040కు గానీ ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని రైల్వే ఎస్పీ జనార్దన్ తెలిపారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News