: కూలిన మిలటరీ హెలికాప్టర్, ఐదుగురి మృతి


ఆఫ్గనిస్థాన్ లోని కాబూల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. రోజువారీ శిక్షణలో భాగంగా బయలుదేరిన ఓ మిలటరీ హెలికాప్టర్ కూలిపోయింది. జాబుల్ ప్రావిన్స్ వద్ద జరిగిన ఈ ఘటనలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు సైనికులూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని ఆఫ్గన్ ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించారు. సాంకేతిక కారణాల వల్ల హెలికాప్టర్ అదుపుతప్పి కుప్ప కూలిందని వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి పేర్లు, వివరాల గురించిన సమాచారం వెలువడాల్సివుంది.

  • Loading...

More Telugu News