: తరచు విమాన ప్రయాణాలు చేసేవారిపై ఈ ప్రభావాలు ఉంటాయి
తరచు విమాన ప్రయాణాలు చేసే వారిపై బ్రిటన్ కు చెందిన సర్రే, స్వీడన్ కు చెందిన లండ్ యూనివర్శిటీలకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువగా విమాన ప్రయాణం చేసే వారు జీవనశైలి సమస్యలు ఎదుర్కొంటారని తేలింది. వారు మానసిక ఒత్తిడికి గురవుతుంటారని, ఒంటరితనం, జెట్ లాగ్ తదితర ప్రభావాలతో పాటు రేడియేషన్ ప్రభావం కూడా వారిపై ఉంటుందని అధ్యయనంలో తేలింది. వీటి కారణంగా, వారు అందరితో కలసి ఉండటానికి ఎక్కువ మక్కువ చూపరట. ఏకాంతంగా గడపడానికే వారు మొగ్గు చూపుతారట. ఈ క్రమంలో, కుటుంబ సభ్యలతో అనుబంధాలు సైతం సన్నగిల్లే అవకాశం ఉందట.