: పాక్ పౌరసత్వాన్ని వదిలేస్తున్నా... నా సొంతగడ్డ ఇక ఇండియానే: అద్నాన్ సమీ
పాకిస్థాన్ పౌరసత్వాన్ని త్యజిస్తున్నట్టు ప్రఖ్యాత గాయకుడు అద్నాన్ సమీ పేర్కొన్నారు. భారత్ లో సమీ ఎంతకాలమైనా ఉండేందుకు కేంద్రం ఇటీవలే అనుమతినిచ్చింది. ఆ నిర్ణయంపై సమీ హర్షం వ్యక్తం చేశారు. సమీ 42వ జన్మదినం ముంగిట ప్రత్యేక అనుమతి నేపథ్యంలో, ఇది భగవంతుడిచ్చిన కానుక అని ఆయన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుతించారు. ఇకపై తన పాకిస్థాన్ పౌరసత్వాన్ని వదిలేస్తున్నట్టు తెలిపారు. 14 ఏళ్లుగా తనకు ఆశ్రయమిచ్చిన ఇండియానే ఇకపై తన సొంతగడ్డ అని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నో వివాదాలతో సతమతమైన ఈ గాయకుడికి కేంద్రం తీపి కబురు చెప్పినట్టయింది. దాంతో, చందమామపై విహరించినంత సంబరంగా ఉందంటున్నాడు సమీ.