: రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబే: శైలజానాథ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే ప్రధాన కారకుడని ఆరోపించారు. అందువల్ల ఇప్పడు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుపైనే ఉందని అన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. తామేం భిక్ష వేయాలని అడగడం లేదని... గత ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. ఈ నెల 8న తిరుపతిలో జరగనున్న పోరుసభ వాల్ పోస్టర్ ను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ శైలజానాథ్ పైవ్యాఖ్యలు చేశారు.