: బంగారం స్మగ్లింగ్ లో కొత్త రూట్... పిల్లల వద్ద దాచి అడ్డంగా దొరికిపోయారు!
విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న బంగారాన్ని ఎంతగా అదుపు చేస్తున్నా స్మగ్లర్లు కొత్త కొత్త ఆలోచనలు వేస్తున్నారు. అంతకన్నా వినూత్నంగా ఆలోచిస్తున్న కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉన్నారు. తాజాగా, తమ పిల్లల దుస్తుల్లో 3.3 కేజీల బంగారం దాచి తెచ్చిన తల్లిదండ్రులు అడ్డంగా దొరికిపోయారు. బ్యాంకాక్ నుంచి ముంబై వచ్చిన ఈ జంట పిల్లల ప్యాంట్లలో బంగారం దాచింది. అబ్బాయి ప్యాంట్లో 2 కిలోలు, అమ్మాయి ప్యాంట్లో 1.3 కిలోల బంగారం దొరికింది. విచారణలో ఆ తల్లిదండ్రులు నేరాన్ని అంగీకరించగా, మైనర్టీ తీరని ఆ చిన్నారులను విడిచి పెద్దలపై కేసు పెట్టారు.