: కడియం శ్రీహరిపై తిరుగుబాటు తప్పదు: మంద కృష్ణ


ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తానన్న హామీని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మాదిగలకు అన్యాయం జరిగేలా ప్రవర్తిస్తే కడియం శ్రీహరిపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో తన కూతురు పోటీపై కడియం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈరోజు కాకతీయ యూనివర్శిటీలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంద కృష్ణ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News