: నవేద్ కు మా దేశంతో సంబంధం లేదు: పాకిస్థాన్


నిన్న ప్రాణాలతో పట్టుబడ్డ లష్కరే తోయిబా ఉగ్రవాది నవేద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ తమ దేశానికి చెందిన వాడు కాదని పాకిస్థాన్ అధికారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు పాకిస్థాన్ కు చెందిన 'నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ' ఓ ప్రకటన చేసింది. ఈ సంస్థ రికార్డుల ప్రకారం నవేద్ పాకిస్థానీ కాదట. అంతేకాదు, ఫొటోల్లో, వీడియోల్లో కనిసిస్తున్న నవేద్ ముఖం ఏ ఒక్క పాకిస్థానీ ఫొటోతో మ్యాచ్ కాలేదని సదరు అధికారులు ప్రకటించారు. మరో విషయం ఏమిటంటే, గతంలో కరుడుగట్టిన ఉగ్రవాది కసబ్ పట్టుబడినప్పుడు కూడా పాకిస్థాన్ ఈ విధంగానే తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ, పాకిస్థాన్ నిజస్వరూపాన్ని, టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న తీరును యావత్ ప్రపంచానికి భారత్ చూపించగలిగింది.

  • Loading...

More Telugu News