: రేపు శ్రీమంతుడు చిత్రాన్ని తిలకించనున్న జాకీ చాన్, షరాన్ స్టోన్!
శ్రీమంతుడు చిత్రం గురించి తెలిసిన మరో ఆసక్తికర విషయమిది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్టార్లు జాకీ చాన్, మార్టిన్ షీన్, షరాన్ స్టోన్ తదితరులు తిలకించనున్నారు. రేపటి నుంచి 16వ తేదీ వరకూ కాలిఫోర్నియాలోని సాన్ జోస్ లో 'ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్' పేరిట జరగనున్న సినిమా పండగలో ప్రారంభ చిత్రంగా శ్రీమంతుడు సినిమాను ప్రదర్శించనున్నారు. 7వ తేదీ రాత్రి 8:30 గంటలకు సాన్ జోస్ లోని 'కెమెరా 12 సినిమాస్'లో ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా శ్రీమంతుడు తొలి చిత్రంగా ప్రదర్శింపబడుతోంది. ఈ ఫెస్టివల్ కు ప్రపంచవ్యాప్తంగా పలువురు సినీ దిగ్గజాలు, టెక్నీషియన్లు హాజరు కానున్నారు. కాగా, శ్రీమంతుడుతో పాటు 12న 'మిణుగురులు' చిత్రాన్ని కూడా ప్రదర్శించనున్నారు. ఈ రెండు చిత్రాలనూ తిలకించి, ఆపై అవార్డుల ఫంక్షన్ కు హాజరు కావాలంటే 100 డాలర్ల టికెట్ ను కొనుగోలు చేయాల్సి వుంటుంది.