: పోలీస్ కప్లైంట్ ఇవ్వకుండా ఉండాల్సింది... వనజాక్షికి బెదిరింపులపై కేఈ విచిత్ర వ్యాఖ్య
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ కు అందిన బెదిరింపు లేఖపై ఏపీ డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి విచిత్రంగా స్పందించారు. బెదిరింపు లేఖ వస్తే వనజాక్షి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండాల్సిందని ఆయన కొద్దిసేపటి క్రితం అభిప్రాయపడ్డారు. తనకు అందిన బెదిరింపు లేఖను విచారణాధికారికి అందజేయాలని ఆయన వనజాక్షికి సూచించారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో వనజాక్షికి భద్రత కల్పించాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు.