: అగ్రి గోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తాం: ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప
అగ్రిగోల్డ్ నయా మోసానికి గురైన బాధితులకు తప్పక న్యాయం చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తులతో పాటు ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న సంస్థలను గుర్తించే ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే అగ్రిగోల్డ్ యాజమాన్యం అక్రమ మార్గాల్లో కూడబెట్టిన ఆస్తులను దశలవారీగా విక్రయించి డిపాజిటర్ల సొమ్ము చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు.