: అంగన్ వాడీ జీతాల పెంపుతో ప్రభుత్వంపై రూ.723 కోట్ల భారం: మంత్రి పీతల సుజాత
ఆంధ్రప్రదేశ్ లో తాజాగా పెంచిన అంగన్ వాడీ సిబ్బంది జీతాల పెంపుతో ప్రభుత్వంపై రూ.723 కోట్ల భారం పడుతుందని మంత్రి పీతల సుజాత తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,04,377 మంది అంగన్ వాడీ సిబ్బంది ఉన్నారని, వారందరికీ జీతాల పెంపు వర్తిస్తుందని చెప్పారు. పెంచిన జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ అంగన్ వాడీల జీతాలు పెంచామని మంత్రి గుర్తు చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో సుజాత కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో పై విషయాలు చెప్పారు.