: కూలడానికి సిద్ధంగా ఉన్న ఉస్మానియా...ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు?: తలసాని ప్రశ్నాస్త్రాలు


తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కొద్దిసేపటి క్రితం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని పలు విభాగాలతో పాటు భవన నిర్మాణాన్ని ఆయన సునిశితంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విపక్షాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ఉస్మానియా ఆస్పత్రి కూలడానికి సిద్ధంగా ఉంది. రేపు జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆస్పత్రి భవన నిర్మాణాలను కాపాడేందుకు గత ప్రభుత్వాలు చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు. ఇప్పుడేదైనా జరిగితే మా ప్రభుత్వాన్ని నిందించేందుకు కాచుక్కూర్చున్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మాట్లాడాలి. ఉస్మానియా ఆస్పత్రిని తరలించే విషయంలో వెనకడుగు ప్రసక్తే లేదు. ప్రజల మేలు కోసమే ఈ పని చేస్తున్నాం’’ అయన అన్నారు.

  • Loading...

More Telugu News