: విడుదలకు ముందే 'బాహుబలి' రికార్డును బద్దలు కొట్టిన 'శ్రీమంతుడు'


ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు' మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ఆ సినిమా గురించిన విశేషాలు వరుసగా బయటకు వస్తున్నాయి. శ్రీమంతుడు చిత్రం విడుదలకు ముందే రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ 'బాహుబలి' రికార్డును బద్దలు కొట్టింది. అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షోలకు సంబంధించి కొన్ని టికెట్లను 15 వేల రూపాయలకు విక్రయించినట్టు తెలుస్తోంది. బాహుబలి టికెట్లను రూ. 4 వేల నుంచి రూ. 8 వేల ధరకు విక్రయించారు. కాగా, అమెరికాలో మహేష్ బాబుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో, ఏకంగా 150 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. డెట్రాయిట్ లో 11 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుండగా, ఈ ప్రాంతంలో ఓ తెలుగు సినిమాకు ఇన్ని హాల్స్ బుక్ చేయడం ఇదే తొలిసారని తెలుస్తోంది. నేటి రాత్రి నుంచి (అమెరికా కాలమానం ప్రకారం 6వ తేదీ మధ్యాహ్నం) 20కి పైగా ప్రీమియర్ షోలను వేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News