: పవన్, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ లతో పాటు సినీ హీరోలందరూ ప్రత్యేక హోదా కోసం పోరాడాలి: చలసాని శ్రీనివాస్


ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజకీయ నేతలతో పాటు సినీ హీరోలు కూడా పాటు పడాలని ప్రత్యేక హోదా సాధన సమాఖ్య గౌరవాధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కదిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ లతో పాటు మిగతా సినీ హీరోలందరూ ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కోరారు. పార్లమెంట్ ను స్తంభింపజేసి ఏపీకి ప్రత్యేక హోదా సాధనకోసం ఎంపీలంతా కృషి చేయాలని ఇదే సభలో కారెం శివాజీ డిమాండ్ చేశారు. పోరాడకుండా వస్తే ఎంపీలకు తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. ఈ సభలో సీపీఐ నేతలు కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News