: ధావన్ హాఫ్ సెంచరీ... ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ శుభారంభం


శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా... శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవెన్ జట్టుతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లో శుభారంభం చేసింది. టాస్ గెలిచిన బోర్డ్ ఎలెవెన్ టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ ఆరంభించిన ఓపెనర్లు లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్ లు నిలకడగా ఆడుతూ నింపాదిగా స్కోరును పెంచుతున్నారు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 77 బంతులు ఆడిన ధావన్ 6 ఫోర్ల సాయంతో 54 పరుగులతో ఆడుతున్నాడు. మరోవైపు, లోకేష్ రాహుల్ 4 ఫోర్ల సహాయంతో 35 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ వికెట్ ను నష్టపోకుండా 96 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News