: రేపే తిరుపతి ఐఐటీ తరగతులు ప్రారంభం


పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఏర్పాటైన ప్రతిష్ఠాత్మక విద్యాలయం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (ఐఐటీ) తరగతులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 7 కొత్త ఐఐటీలను కేంద్రం ప్రకటించగా, వాటిలో తిరుపతి కూడా ఒకటి. తిరుపతిలోని శ్రీ కృష్ణ తేజ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తరగతి గదులను ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అటవీ శాఖా మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News