: యాకూబ్ మెమన్ ను ఉరితీసిన తలారికి విద్యార్థి సంఘం రూ. 10 వేల కానుక
బొంబాయి వరుస పేలుళ్ల ఘటనలో దోషి యాకూబ్ మెమన్ ను ఉరితీసిన తలారికి రూ. 10 వేల చెక్ పంపించారు. కర్ణాటకలోని ఓ విద్యార్థి సంఘం ఈ చెక్కును పంపింది. అమాయకుల ప్రాణాలను బలిగొన్న మెమన్ లాంటి వ్యక్తిని ఉరి తీసిన తలారిని గౌరవించాలని భావించిన విద్యార్థి సంఘం ఈ మేరకు కాలేజీ యాజమాన్యానికి తమ ఆలోచనను తెలిపింది. వారు మహారాష్ట్రలోని జైలు అధికారులను సంప్రదించారు. దీనికి జైలు అధికారులు అనుమతించారు. ఈ క్రమంలో, ప్రతి క్లాసు నుంచి స్వచ్ఛంద విరాళాలను సేకరించారు. అలా వసూలైన రూ. 10వేల చెక్ ను మహారాష్ట్ర డీజీపీకి పంపారు. అంతేకాకుండా, ఈ పని చేయడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని డీజీపీకి లేఖ రాశారు. ఈ చెక్ ను తలారికి అందజేయాలని కోరారు.