: రూ.10 కోట్ల అవినీతి ‘తిమింగలం’... వాణిజ్య పన్నుల శాఖ డీసీపై ఏసీబీ దాడి
తెలంగాణలో మరో అతినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టేశారు. వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న సాయి కిశోర్ నల్లగొండ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన గారి అవినీతి భాగోతంపై బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, నేటి ఉదయం నల్లగొండ సహా హైదరాబాదుల్లోని సాయి కిశోర్ ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా సాయి కిశోర్ రూ.10 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. పట్టుబడిన సొత్తులో రెండు కిలోల బంగారం, పది కిలోల వెండి, పెద్ద సంఖ్యలో స్థిరాస్తుల పత్రాలు లభించాయి. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.