: ఆ జర్నలిస్ట్ కోసం ముంబయి పోలీసుల వేట!


ఇటీవల యాకూబ్ మెమన్ ను ఉరితీయడంపై సానుభూతి వ్యక్తం చేసి, ఉగ్రవాద సంస్థ ఐఎస్ఎస్ లో తాను చేరాలనుకుంటున్నట్టు తెలిపిన ఓ జర్నలిస్ట్ ను పట్టుకునేందుకు ముంబయి పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం, అతను నవీ ముంబయిలో నివసిస్తున్నాడని క్రైమ్ బ్రాంచ్ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతను బాంద్రాలో ఉన్నట్టు తెలుసుకుని అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా అతను తప్పించుకున్నట్టు తెలిసింది. సదరు జర్నలిస్టు సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద పోస్టుపై ఓ వ్యక్తి కొన్ని రోజుల కిందట ముంబయి పోలీసులకు తెలిపాడు. అతని పోస్టులో తన భారతీయ పౌరసత్వాన్ని వదులుకుని, ఐఎస్ఎస్ అధికారప్రతినిధిగా ఉండాలనుకుంటున్నట్టు తెలిపాడు. తన పేరు జుబెర్ అహ్మద్ ఖాన్ అని, తానొక జర్నలిస్ట్ నని చెప్పాడు. అదే సమయంలో యాకూబ్ మెమన్ ను అతను అమరవీరుడుగా పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News