: పాక్ ఉగ్రవాది నావెద్ అలియాస్ ఉస్మాన్ పై లోక్ సభలో ప్రకటన చేసిన రాజ్ నాథ్
నిన్న ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో ప్రకటన చేశారు. ఈ దాడిలో ఇద్దరు భారత జవాన్లు మరణించారని... ఒక ఉగ్రవాది హతమయ్యాడని చెప్పారు. మరో ఉగ్రవాదిని మన బలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయని... పట్టుబడ్డ ఉగ్రవాది పేరు మహమ్మద్ నావెద్ అలియాస్ ఉస్మాన్ అని వెల్లడించారు. ఉస్మాన్ నుంచి మరిన్ని వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అయితే, రాజ్ నాథ్ వెల్లడించిన విషయాల్లో కొత్త వివరాలేమీ లేవని విపక్ష సభ్యులు ఆరోపించారు.