: మీరేగా, నాడు ఇరాక్ తో యుద్ధానికి పురిగొల్పింది, ఇరాన్ తోనూ యుద్ధం చేయాలా?: ఒబామా మోటు ప్రసంగం


ఒకవైపు ఇరాన్ తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా చర్చలు జరుగుతున్న వేళ, దాన్ని అడ్డుకునేలా విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాస్తంత కటువుగా మాట్లాడారు. రిపబ్లికన్ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి, నాటు భాషను వాడుతూ విరుచుకుపడ్డారు. దశాబ్దం క్రితం ఇరాక్ తో యుద్ధానికి పురిగొల్పిన వారే, నేడు మరో యుద్ధంలోకి దేశాన్ని నెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. "ప్రసంగాల గారడీ వద్దు. మనముందున్నవి రెండే మార్గాలు. ద్వైపాక్షికమా? లేక యుద్ధమా? అన్నది తేల్చుకోవాలి. అది ఇవాళో లేకుంటే మరో మూడు నెలల తరువాతో కాదు... త్వరగా తేల్చుకోవాలి" అని అమెరికన్ యూనివర్శిటీలో సుమారు 200 మందిని ఉద్దేశించి ఆయన అన్నారు. "దేశ ప్రయోజనాల కోసం ఒప్పందాలు కుదిరేలా అడుగులు పడుతున్న వేళ యుద్ధాన్ని ఎందుకు కోరుకోవాలి?" అని ప్రశ్నించారు. 2003లో ఇరాక్ లో యుద్ధానికి అమెరికన్ కాంగ్రెస్ అంగీకరించిన తరువాత, ఆ స్థాయిలో దేశంపై ప్రభావం చూపేంతటి చర్చ ఇప్పుడు 'ఇరాన్ తో అణు ఒప్పందం'పై జరుగుతోంది. "నోర్లు మూసుకోండి (షట్ ద నాయిస్), డీల్ కు మద్దతివ్వండి" అని ఒబామా అన్నారు. ఇరాన్ తో డీల్ ను వ్యతిరేకిస్తే, యుద్ధానికి సిద్ధపడ్డట్టేనన్న సంకేతాలు వెలువడతాయని ఆయన అన్నారు. ఈ డీల్ ను అడ్డుకోవాలని చూస్తూ, విమర్శిస్తున్న రిపబ్లికన్లపై విరుచుకుపడ్డారు. కాగా, ఇరాన్ తో న్యూక్ డీల్ కుదుర్చుకోవడంపై ఆయన పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు అమెరికన్ ప్రజలు సైతం రెండు భాగాలుగా విడిపోయారు.

  • Loading...

More Telugu News